మే 19 వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి ఈరోజు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 గుడిపాటి వెంకటచలం జననం : కథ నవలా రచయిత గుడిపాటి వెంకటచలం 1894 మే  19వ తేదీన జన్మించారు. చలం గా  ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత వేదాంతి సంఘ సంస్కర్తగా  ఎంతగానో కృషి చేసారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో గుడిపాటి వెంకట చలం కూడా ఒకరు. గుడిపాటి వెంకట చలం రచించిన చాలా రచనలు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు వాటిని వారు ఎదుర్కొనే విధానములను గుడిపాటి వెంకట చలం రచనలలో క్లుప్తంగా చర్చించాడు. గుడిపాటి వెంకట చలం రచించిన రచనలు ఇతివృత్తము తాత్వికత రచనాశైలి ఆయనను ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి. 

 

 నాథూరామ్ గాడ్సే జననం : మహాత్మా గాంధీ ని హత్య చేసిన వారిలో ప్రధాన నిందితుడు పాత్రధారి అయిన నాథురం గాడ్సే... 1910 మే 19వ తేదీన జన్మించారు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా నాథురం గాడ్సే ప్రసిద్ధి పొందారు. అయితే మొదట్లో గాంధీ విధానాలను ఎంతగానో అభిమానించే నాథురం గాడ్సే తర్వాత గాంధేయవాద నుంచి విడిపోయి.. ఆర్ఎస్ఎస్ లో చేరాడు. ఇక అప్పటి నుంచి గాంధీ విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చిన గాడ్సే... భారత్ పాకిస్తాన్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆ సమయంలో గాంధీ భారత్ పాకిస్తాన్ కి 55 కోట్ల నష్టపరిహారం కూడా ఇవ్వాలని నిరాహార దీక్ష కూడా చేపట్టాడు నాథురం గాడ్సే. ఇక గాంధీ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన నాథురం గాడ్సే నారాయణ్ ఆప్తే,  గోపాల్ గాడ్సే మరియు కొంతమంది సహాయంతో గాంధీని హత్య చేశాడు. హత్య చేసి అనంతరం పారిపోకుండా ఘటనా స్థలంలోనే పోలీసులకు లొంగిపోయాడు నాథురం గాడ్సే. ఆ తర్వాత హర్యానాలోని అంబాలా జైలులో నాథురం గాడ్సే ని ఉరి తీశారు. 

 

 నీలం సంజీవరెడ్డి జననం : భారత రాష్ట్రపతిగా ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా లోక్సభ సభాపతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ఇలా రాజకీయాలలో ఎన్నో ఉన్నత పదవులను చేపట్టిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి. 1913 మే 19వ తేదీన జన్మించారు. చైనా రాజకీయ నాయకుడిగా ప్రజల అభిమానాన్ని ఎంతగానో సంపాదించిన వ్యక్తి గా ఓ వెలుగు వెలిగాడు. ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా నిస్వార్థ సేవలు అందించిన ప్రజానాయకుడు నీలం సంజీవరెడ్డి. ముఖ్యంగా లోక్సభ సభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మంచి వాతావరణం ఏర్పాటు చేసి స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన రాయలసీమ రాజకీయ ఆణిముత్యం  నీలం సంజీవరెడ్డి. 

 

 

 పి లీల జననం  : ప్రముఖ దక్షిణభారత నేపథ్యగాయని మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రప్రథమ నేపథ్యగాయని గా ఎంతగానో గుర్తు సంపాదించారు లీల. 1934  మే 19వ తేదీన జన్మించారు. తమిళ మళయాళ తెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగులో మైలురాళ్లుగా నిలిచిన ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు పి లీల. ఇక పి.లీల పాడిన పాటలు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి. తన సినీ జీవితంలో అనేక అవార్డులను అందుకున్నారు లీల. 1969లో కేరళ ప్రభుత్వ నుండి  ఉత్తమ నేపథ్య గాయకురాలిగా అవార్డు అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: