జీహెచ్ఎంసీ పరిధిలో రూ.9,700 కోట్లతో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నగరంలో సుమారు 85 వేలకు పైగా ఇళ్లను పేదలకు అందించనున్నట్లు తెలిపారు. దీని పై సమీక్ష సమావేశం నిర్వహించగా.. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతోపాటు, జీహెచ్ఎంసీ హౌసింగ్ విభాగం అధికారులు, పురపాలక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.