అమరావతి : సెట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. మంగళవారం నాడు మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఈ నెల 10 నుంచి వివిధ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మొత్తం 7 కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు నిర్వహిస్తున్నామని.. ఎంసెట్లో సుమారు 2,72,720 మంది నమోదు చేసుకున్నారని మంత్రి తెలిపారు...