బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఫ్లేమ్ టూర్‌ను బిగ్ బాస్ టీం ఘనంగా ప్రారంభించింది. అగ్ని పరీక్ష ప్రాముఖ్యను ప్రేక్షకులకు తెలియజేసేలా ఈ టూర్‌ను కొనసాగిస్తున్నారు. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టి, విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాల ఈ ఫ్లేమ్ టూర్‌ను విజయనగరంలో ఘనంగా ప్రారంభించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన క‌ల్యాణ్ ప‌డాల బిగ్‌బాస్ హౌస్‌లో త‌న క్రమ‌శిక్ష‌ణ‌, ప‌ట్టుద‌ల‌, స‌హ‌నంతో పాటు అద్భుత‌మైన ఆట‌తీరుతో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు. అనంత‌రం బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 9 విజేత‌గా నిలిచి చ‌రిత్ర సృష్టించారు.

ఈ నేప‌థ్యంలో నిర్వ‌హించిన ‘ఫ్లేమ్ టూర్’లో క‌ల్యాణ్ ప‌డాల‌ను చూసేందుకు అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. క‌ల్యాణ్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆస‌క్తి చూపించారు. కళ్యాణ్ పడాల తన అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ త‌న బిగ్‌బాస్ ప్ర‌యాణంలో విజ‌య‌న‌గ‌రం ప్ర‌జ‌లు, అభిమానులు అందించిన ప్రేమ‌, మ‌ద్ద‌తును ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేన‌ని తెలిపారు.

విజ‌య‌న‌గ‌రం నుంచి బిగ్‌బాస్ వేదిక‌ వరకు సాగిన త‌న ప్ర‌యాణం ప్రేక్ష‌కుల ప్రేమ‌, ఆద‌ర‌ణ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని క‌ల్యాణ్ ప‌డాల పేర్కొన్నారు. ఫ్లేమ్ టూర్ సంద‌ర్భంగా అభిమానుల ఉత్సాహం, కేరింత‌ల‌తో విజ‌య‌న‌గ‌రం సంద‌డిగా మారింది.
క‌ల్యాణ్ ప‌డాల ఫ్లేమ్ టూర్‌కు అభిమానుల నుంచి ఘ‌న స్పంద‌న ల‌భించింది.

ఈ టూర్ ఇప్పుడు విశాఖపట్నానికి చేరుకుంది. అక్కడ బిగ్ బాస్ 9 ఫైనలిస్ట్ డెమాన్ పవన్ సందడి చేశారు. విశాఖలో నిర్వహించిన ఫ్లేమ్ టూర్‌లో అభిమానులను ఉద్దేశించి డెమాన్ పవన్ ఉత్తేజకరమైన ప్రసంంగాన్ని అందించారు. అగ్ని పరీక్ష అనేది ఓ గొప్ప వేదిక అని, బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాలనే ఆశయాన్ని నెరవేర్చే వారధి అని డెమాన్ పవన్ అన్నారు. అగ్ని పరీక్ష అంటే కేవలం టాస్కులు కావని, మన జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనేలా చేసే ఓ వేదిక అని, బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాలనే కోరికని, మనలోని ఫైర్‌ని సజీవంగా ఉంచే వేదిక అని డెమాన్ పవన్ అన్నారు.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ ఫ్లేమ్ టూర్‌ను చేపట్టారు. ఈ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్ సందడి చేశారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: