జగన్ అధికారంలోకి వచ్చాకా కొన్ని నిర్ణయాలు తప్ప ఏవీ అంతగా కలిసి రాలేదని చెప్పాలి. మూడు రాజధానుల వ్యవహారం ఎక్కడికి అక్కడే ఉంది.. కోర్టులో ఆ వ్యవహారం నానుతూ ఉంది. ఈమధ్య కోర్టుల్లో వైసీపీ కి చేదు అనుభవాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఈ మూడు రాజధానుల వ్యవహారంలో కూడా ఏదైనా తేడా జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. పైగా కోర్టు న్యాయమూర్తులు సైతం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండడం, ప్రభుత్వం పై కోపంగాఉండడం గమనిస్తున్నవిషయమే..