బీజేపీ పార్టీ వైఖరి ఎలా ఉందంటే గివ్ అండ్ టేక్ పాలసీ లా ఉంది.. అయితే అది వేరే వేరే విషయాల్లో అయితే పర్వాలేదు. కానీ ప్రజల ఆరోగ్యం విషయంలో కూడా అలానే ఉంటే ఆ పార్టీ ఇప్పుడు అనుభవిస్తున్న అధికారం పోయే ప్రమాదం ఉంది.. దేశంలో ఈ సంవత్సరం ఆరంభంలో ముంచుకొచ్చిన కరోనా ఎంత మందిని బలికొందో మాటల్లో చెప్పలేం.. అలాంటి కరోనా ను తట్టుకుని నిలబడ్డ ప్రజలకు ఒకే ఒక ఊరట కరోనా వ్యాక్సిన్.. ఈ కరోనా వ్యాక్సిన్ వస్తే కరోనా ని లేకుండా అంతం చేయొచ్చని అందరు అనుకున్నారు..