విశాఖ లో తెలుగు దేశం పార్టీ నాశనానికి పునాదులు పడ్డాయి.. ఇప్పటికే అక్కడ చాలామంది నేతలు వైసీపీ లోకి రావాలని ఆలోచిస్తున్నారు. సమయం కోసం చూస్తున్నారు.. ఇప్పటికే వాసుపల్లి గణేష్ చేరిక తో టీడీపీ లో కంగారు మొదలై అందరు నేతలు వైసీపీ లోకి వెళదాం అని డిసైడ్ అయిపోయారు. .. వెళదాం..వెళదాం అనుకున్నవారు ఇక వెళ్ళడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో గంటా మాత్రం ఇంకా దీనిపై సస్పెన్సు పెంచుతూ పోతున్నారు.. అసలు ఆయనకు వచ్చే ఆలోచన ఉందా లేదా అని అక్కడివారు అనుకుంటున్నారు.