రాష్ట్రంలో ప్రజల ఏకగ్రీవ తీర్పుతో అధికారం లోకి వచ్చింది వైసీపీ పార్టీ.. ప్రతిపక్షాల జోరును నిలువరిస్తూ టీడీపీ లాంటి అధికారంలో ఉన్న పార్టీ ను, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ని కాదని ప్రజలు జగన్ ను నమ్మి గెలిపించారు.. ఇక వైసీపీ నేతలు సైతం ప్రజల నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా  నడుచుకుంటూ వస్తున్నారు.. అయితే అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ళు కావస్తుండగా ఇప్పుడు కొంతమంది వైసీపీ నేతలు గతి తప్పుతున్నారని అక్కడి ప్రజలు వాపోతున్నారు.. మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత పాలనపై సరైన శ్రద్ధ పెట్టడం లేదట.. దాంతో అక్కడివారు జగన్ కు ఫిర్యాదు చేసేవిధంగా ముందుకు వెళ్తున్నారట..