నిన్న దేశం మొత్తం భారత్ బంద్ జరిగింది.. ప్రజల సహాయ సహకారాలతో, పలు రాష్ట్రాల రాజకీయ నాయకుల మద్దతు తో ఈ బంద్ రైతుల మేలు కోసం చేసి విజయవంతం చేశారు.. గత కొన్ని రోజులుగా దేశ నడిబొడ్డున రైతులు మోడీ రైతుల విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగా నిన్న భారత్ బంద్ కి పిలుపునివ్వగా ఆ బంద్ ప్రశాంతంగా నిలిచింది.. తెలంగాణ రాష్ట్రంలో టీ ఆర్ ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీలో ఈ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించగా ప్రజలు కూడా సహకరించారు..