తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ఎంతో ప్రాధాన్యత ను సంతరించుకుంది.. గతంలోలా కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీ లోని కేంద్ర పెద్దలను కలవలేడు. ఎందుకంటే అప్పుడు తనకు ఎదురులేదు అన్న భావన కేసీఆర్ లో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఆయనకు సవాల్ గా నిలిచింది. సో ఇప్పుడు గతంలోని రీతిగా కేంద్ర పెద్దలతో డీల్ చేయలేడు కేసీఆర్.. అంతేకాదు GHMC ఎన్నికల సమయంలో కేసీఆర్ బీజేపీ ని దుయ్యబట్టారు.. వరద సాయం విషయంలో, నగరంలో శాంతి భద్రత ల విషయంలో , ఇంకా పలు సందర్భాల్లో మోడీ ని తీవ్రంగా విమర్శించారు.