మలయాళంలో విజయం సాధించిన `అయ్యప్పయుమ్ కోషియమ్`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. సాగర్ చంద్ర దర్శకుడు. ఓ కథానాయకుడిగా పవన్ కల్యాణ్ ఫిక్సయ్యాడు. రెండో నాయకుడి పాత్రలో రానా కనిపిస్తాడని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.రానా నటించే సినిమాలన్నింటికీ.. సురేష్ బాబు భాగస్వామిగా వ్యవహరించడం ఆనవాయితీగా మారుతోంది. రానా ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇస్తే, ప్రొడక్షన్ పరంగానూ సురేష్ బాబు వాటాకి వస్తాడు. ఆ విషయంలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ తో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని టాక్. ఈ వ్యవహారాలన్నీ ఓ కొలిక్కి రానందువల్లే.. రానా పేరు ఇంకా ప్రకటించలేదని తెలుస్తోంది.