రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికీ అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ పార్టీ దానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుంది..ఇప్పటికే  ప్రజల్లోకి కూడా బాగానే దూసుకువెళ్తుంది అన్న పేరును అయితే బీజేపీ సంపాదించింది. వస్తు వస్తూనే అధికార వైసీపీ ని కాకుండా టీడీపీ ని టార్గెట్ చేసి మంచి వ్యూహాన్నే వేసింది బీజేపీ.. ఈ దెబ్బతో  టీడీపీ పార్టీ భవిష్యత్ శూన్యం అని స్పష్టంగా తెలిసిపోతుంది.. ఇక తెలంగాణ లో బలపడడం కూడా బీజేపీ కి కలిసొచ్చే అంకేశం.. టీడీపీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు..ఇప్పుడు మిగిలిన సీట్లు కూడా బీజేపీ తీసుకెళ్లేలా ఉంది.. అయితే రాజకీయంగా ఒక్కొక్క మెట్టు పైకెక్కుతున్న బీజేపీ తనతో పొత్తులో ఉన్న జనసేన విషయంలో ఆ పార్టీ కి అన్యాయం చేయడం ఎవరికీ పెద్దగా నచ్చడం లేదు..