జగన్ రాష్ట్రంలో ఎలాంటి పాలన అందిస్తున్నారో అందరు చూస్తూనే ఉన్నారు. బంపర్ మెజారిటీ తో గెలిపించిన ప్రజల నమ్మకంన్ని జగన్ ఎక్కడా వమ్ము చెయ్యట్లేదు. ప్రతిపక్షాలు కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పెట్టాలని చూసినా దాన్ని జగన్ అధిగమించి సుపరిపాలన కొనసాగిస్తున్నారు.. తన జీవితాన్నే ప్రజలకు అంకితం చేసిన జగన్ పాలనా చూస్తుంటే గతంలో ఏ సీఎం చేయని విధంగా పాలనా అందిస్తున్నారని కితాబు దక్కించుకుంటున్నాడు. జగన్ ఈ ఏడాది మొత్తానికి ఏ ఒక్క నెలనూ వదలకుండా పదుల సంఖ్యలో పధకాలను అమలు చేసిన తీరుతో దేశంలోనే నంబర్ వన్ అనిపించుకున్నారు. ప్రపంచమంతా కరోనా ప్రభావంతో కకావికలు అయినా కరెన్సీ కదిలింది మాత్రం ఒక్క ఆంధ్రాలోనే.