క‌రోనా ఎఫెక్ట్‌తో ఏపీలో వ్య‌వ‌స్థ‌లు అన్ని ట్రాక్ త‌ప్పుతున్నాయి. ఇప్ప‌టికే లాక్ డౌన్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు చాలా న‌ష్టం వాటిల్లింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వానికి భారీగా ఖ‌జ‌నా బొక్క ప‌డింది. వేల‌ల్లో వ‌చ్చే ఆదాయం కాస్తా ఇప్పుడు రు. 10 కోట్లు కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఇక ఇప్ప‌టికే జీతాలు కూడా వాయిదాల ప‌ద్ధ‌తిలో చెల్లించాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి గురువారం ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది.

 

ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌లు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. పరీక్షలకు సంబంధించి రాష్ట్రంలో చేసిన ఏర్పాట్లన్నీ లాక్‌డౌన్‌ వల్ల ఎక్కడకక్కడే నిలిచిపోయాయి. ఈ కారణంగా నిర్ణీత తేదీల్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని ఉన్నత విద్యామండలి పేర్కొంది. లాక్‌డౌన్ వ‌ల్ల ఇప్ప‌టికే ఏపీలో ప‌రీక్షా కేంద్రాలు అన్ని మూత‌ప‌డ్డాయి. వీట‌ల్లో చాలా చోట్ల ప‌వ‌ర్ బ్యాక‌ప్ కూడా లేదు. ఇక ఎంసెట్ ద‌ర‌ఖాస్తుకు ముందుగా మార్చి 29 వ‌ర‌కు గ‌డువు ఉన్నా దీనిని ఏప్రిల్ 5 వ‌ర‌కు పొడిగించారు. ఇప్పుడు లాక్ డౌన్ నేప‌థ్యంలో ఈ గ‌డువు ఏప్రిల్ 17 వ‌ర‌కు పొడిగించారు.

 

ఇప్పటికీ సుమారు 50 వేల మందికి పైగా విద్యార్థులు ఎంసెట్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంది. ఇక ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డ‌మే క‌ష్టంగా ఉన్న నేప‌థ్యంలో అన్ని సెట్లు వాయిదా వేస్తున్నారు. ఇవ‌న్నీ మే చివ‌ర్లో లేదా జూన్ నెలలో ఉండ‌నున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: