దేశంలో ప్రస్తుతం కరోనాని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ని ఎంతో పటిష్టంగా అమలు చేస్తున్నారు.  తాజాగా పోలీసుల పనితీరు పై సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా  కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల పనితీరుపై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. రాత్రింబవళ్లు ప్రజల కోసం వారు చాలా కష్టపడుతున్నారని ఆయన చెప్పారు.  ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

 

ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసుల పని తీరు అద్భుతం. నిద్రాహారాలు కూడా మాని వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్‌ నుంచి స్వయంగా చూస్తున్నాను... మీ సేవలు అనీర్వచనీయం అన్నారు.  ప్రజలంతా పోలీసులకు సహకరించండి. పోలీసులు చేస్తున్న పనికి ఓ పోలీసు బిడ్డగా నేను వారికి సెల్యూట్ చేస్తున్నాను  అని చిరంజీవి చెప్పారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ పై తెలంగాణ డీజీపీ స్పందించారు.

 

  మీరు కేవలం మమ్మల్ని మాత్రమే ప్రేరేపించలేదని... కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరినీ ప్రేరేపించారని డీజీపీ అన్నారు. మీ నుంచి స్ఫూర్తిని పొందే ఎంతో మందిని మేల్కొలిపారని కితాబిచ్చారు. కరోనాపై పోరాటంలో తమకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చెప్పారు. మీ సందేశం ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేస్తాయని అన్నారు.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనాని కట్టడి చేయడానికి డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: