దేశంలో కరోనా కేసులు పెరుగుదల ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. శనివారం ఉదయం వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7600కు చేరుకుంది. మ‌రో ప‌క్క దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా క‌ల్లోలం రేపుతోంది. రోజు రోజుకూ ఇక్క‌డ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో క‌రోనా క‌ట్ట‌డికి సీఎం కేజ్రీవాల్ ప‌క‌డ్డందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

 

ఈ నేప‌థ్యంలోనే ఢిల్లీలో లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వ‌ర‌కు పొడిగించాల‌ని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని కోరారు. వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేజ్రివాల్ మాట్లాడుతూ... దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్‌ను పొడిగిస్తేనే మంచిద‌ని అన్నారు. లాక్ డౌన్ ను కేంద్రం పొడిగించ‌క‌పోయినా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం పొడిగించే అవ‌కాశం ఉంద‌న్నారు. అందువ‌ల్ల కేంద్ర‌మే ఈ నిర్ణ‌యం తీసుకుంటే మంచిద‌ని ఆయ‌న అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: