ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద రూ.50 లక్షలు భీమా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లను ఈ బీమా పరిధిలో చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
 
సీఎం జగన్ గ్రామ, వార్డ్ వాలంటీర్లతో పాటు గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులను, ఆశా వర్కర్లను బీమా పరిధిలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడాంలో గ్రామ, వార్డ్ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఆశావర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి సేవలను గుర్తించి ప్రభుత్వం వారికి బీమా ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై గ్రామ, వార్డ్ వాలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు 
 
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 2,60,000 గ్రామ, వార్డ్ వాలంటీర్లకు ప్రయోజనం చేకూరనుంది.నిన్న ప్రభుత్వం నుంచి వాలంటీర్లకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీని వర్తింజేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: