క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. ఈ క‌రోనా ఎప్పుడు ?  ఏ రూపంలో ముంచుకు వ‌స్తుందో ?  కూడా అర్థం కావ‌డం లేదు. అయితే క‌రోనాతో ఎన్ని న‌ష్టాలు ఉన్నాయో ?  కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ప్ర‌పంచంలో చాలా దేశాల్లో కాలుష్యం జీరో అయ్యింది. నీటి కాలుష్యం పూర్తిగా త‌గ్గిపోయింది. కొన్ని సంవ‌త్స‌రాలుగా కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నా స్వ‌చ్ఛ‌త లేని గంగా, య‌మున లాంటి న‌దుల్లో నీటి కాలుష్యం జీరో అయ్యి ఆ నీరు తాగేంత స్వ‌చ్ఛ‌త‌కు వ‌చ్చేశాయి. మ‌నుష్యుల ఉరుకుల ప‌రుగుల‌కు బ్రేక్ వేసిన క‌రోనా ఇప్పుడు మ‌రో సూప‌ర్ న్యూస్ ప్ర‌పంచానికి తెలియ‌జేసింది.

 

ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా కాలుష్యం పూర్తిగా త‌గ్గిపోవ‌డంతో ఓజోన్ పొర‌కు ఉన్న రంధ్రం పూర్తిగా మూసుకుపోయింద‌ని వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నంలో తేలింది. కోప‌ర్నిక‌స్ అట్మాస్పియ‌ర్ మానిట‌రింగ్ స‌ర్వీస్‌, కోప‌ర్నిక‌స్ క్లైమేట్ చేంజ్ స‌ర్వీస్ ప‌రిశీల‌న‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. ఇదిలా ఉంటే ఓజోన్ పొర క్షీణిస్తున్న విష‌యం 1970 నుంచి శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నాల్లో తేలింది. భూమిమీద ఉష్ణోగ్ర‌త‌లు, కాలుష్యం పెర‌గ‌డంలో నిన్న‌టి వ‌ర‌కు తీవ్ర ఆందోళ‌న‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఈ పొర‌కు ఉన్న రంధ్రం పూడిపోవ‌డం అంటే అది క‌రోనా మ‌హ‌త్మ‌మే అని చెప్పాలి. ఇక‌పై అయినా భూ ప్ర‌పంచంపై కాలుష్య నివార‌ణ‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అన్ని దేశాలు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: