అప్పుడెప్పుడో శ్రీకాంత్ సినిమాలో న‌టించిన ల‌క్ష్మీరాయ్ కాస్తా ఆ త‌ర్వాత రాయ్ ల‌క్ష్మీగా మారిపోయింది. లారెన్స్ సినిమాల్లో వ‌రుస‌గా న‌టించినా ఎందుకో గుర్తింపు రాలేదు. తెలుగు, త‌మిళ్ ఛాన్సులు కూడా ఆమెను స్టార్‌ను చేయ‌లేదు. ఇక హీరోయిన్ ఛాన్సుల క‌న్నా ఐటెం సాంగుల‌తోనే త‌న అంద చందాలు ఆర‌బోసి గుర్తింపు తెచ్చుకున్న ఈ రాయ్ ల‌క్ష్మీ మెగాస్టార్ చిరు స‌ర‌స‌న చేసిన ర‌త్తాలు సాంగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎప్పుడూ బికీనీ అందాల‌తో సోష‌ల్ మీడియాలో కావాల్సినంత ర‌చ్చ చేస్తే ఈ ర‌త్తాలు తాజాగా త‌న ఎఫైర్ల గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

 

ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇంటికి ప‌రిమిత‌మైన ఈ అమ్మ‌డు వీలున్న‌ప్పుడల్లా త‌న హాట్ హాట్ బికీనీ అందాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌న ఫ్యాన్స్‌కు కావాల్సినంత కిక్ ఇస్తోంది. ఇక రాయ్‌ల‌క్ష్మీకి గ‌తంలో చాలా మందితో ఎఫైర్లు ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ త‌న‌కు చాలా మందితో ఎఫైర్లు ఉన్నాయని. మూడుసార్లు ప్రేమ‌లో ప‌డి మోస‌పోయాన‌ని చెప్పింది. ప్ర‌స్తుతం తాను నిజ‌మైన ప్రేమ కోసం అన్వేషిస్తున్నాన‌ని చెప్ప‌డం విశేషం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: