అంద‌రూ ఊహించిన‌ట్లే జ‌రిగింది. రోజురోజుకూ క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో మే 3వ తేదీ త‌ర్వాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగిస్తార‌న్న అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి. తాజాగా.. దేశ వ్యాప్తంగా మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. మే 3వ తేదీ తరువాత రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోమ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.  ఈ కాలంలో వివిధ కార్యకలాపాలను నియంత్రించడానికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలోని జిల్లాల వారీగా అంటే రెడ్ (హాట్‌స్పాట్) ), గ్రీన్, ఆరెంజ్ జోన్లుగా విభ‌జించింది.

 

గ్రీన్, ఆరెంజ్ జోన్లలోకి వచ్చే జిల్లాల్లో గణనీయమైన సడలింపులను ఇచ్చింది. అంటే..  దేశ‌వ్యాప్తంగా 130 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉండ‌గా.. ఆయా జిల్లాల్లో లాక్‌డౌన్ య‌థావిధిగా కొన‌సాగుతుంద‌న్న‌మాట‌. ఇప్ప‌టివ‌ర‌కు భారతదేశంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 35365 కు చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,152 మంది మ‌ర‌ణించారు. నిజానికి... రేపు ఉద‌యం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ లాక్‌డౌన్‌పై మాట్లాడుతార‌ని అంద‌రూ అనుకున్నారు. ఈ రోజు కీల‌క భేటీ నిర్వ‌హించి, కేంద్రం ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: