ఏపీ ప్రజలకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాని విజయనగరం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలోని బలిజపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన మహిళకు కరోనా నిర్ధారణ అయింది. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న మహిళ విశాఖలోని ఆస్పత్రిలో చేరగా మహిళకు కరోనా నిర్ధారణ అయింది. 
 
దీంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కరోనా కేసులు నమోదైనట్లే అని చెప్పాలి. అయితే వైద్య, ఆరోగ్య శాఖ ఈ కేసును ఇంకా ధృవీకరించాల్సి ఉంది. రేపు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసే హెల్త్ బులెటిన్ లో విజయనగరం జిల్లాలో తొలి కేసు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో తొలి కేసు నమోదు కావడంతో మహిళ కుటుంబసభ్యులను, సన్నిహితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
రాష్ట్రంలో 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదైనా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో కరోనా నిర్ధారణ కాగా తాజాగా విజయనగరం జిల్లాలో తొలి కేసు నమోదైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: