దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. దేశంలో ప్రతిరోజూ 3000కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా ఉత్తరపదేశ్ రాష్ట్రంలో ప్లాస్మా థెరపీ తీసుకున్న మొదటి వ్యక్తి చనిపోయాడు. 58 ఏళ్ల డాక్టర్ ప్లాస్మా థెరపీ తీసుకుని కరోనాను జయించాడు. కానీ నిన్న అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో ఆయన మృతి చెందారు. లక్నోని ప్రముఖ ఆస్పత్రి వైద్యులు ఈ మేరకు ప్రకటన చేశారు. 

 

ఒరియాకు చెందిన డాక్టర్ కరోనా భారీన పడి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ప్లాస్మా థెరపీ అనంతరం ఆయనకు కరోనా నెగిటివ్ రావడంతో నిన్న వైద్యులు ఆ వ్యక్తిని డిశ్చార్జి చేయాలని భావించారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఆ వ్యక్తికి హార్ట్ ఎటాక్ వచ్చిందని కాపాడాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదని డాక్టర్ తెలిపారు. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా కొందరు కరోనాను జయిస్తుంటే మరికొందరు మాత్రం మృత్యువాత పడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: