కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్ పై రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమాకు సంబంధించి డించక్ అనే సాంగ్ టీజర్ ని విడుదల చేసారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ నటిస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాను గత నెలలోనే విడుదల చెయ్యాల్సి ఉన్నా లాక్ డౌన్ కారణంగా అది వాయిదా పడింది. ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫాం లో విడుదల చేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు. 

 

ఇక ఈ సినిమాలో రామ్ పోషించే పాత్ర ఏంటీ అనేది స్పష్టత రావడం లేదు. ఇక ఈ సినిమాలోని పాట టీజర్ ని విడుదల చేయగా పాట లో రామ్ డాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. యుట్యూబ్ లో ఈ వీడియో వైరల్ గా మారింది. హేబా పటేల్ రామ్ తో కలిసి డాన్స్ చేసింది.

https://www.youtube.com/watch?v=yjR6kc7ZSkg&feature=youtu.be 

 

మరింత సమాచారం తెలుసుకోండి: