తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనాతో కలిసి జీవించక తప్పదని అన్నారు. రాష్ట్రంలో ఆటోలకు, ట్యాక్సీలకు హైదరాబాస్ సిటీతో సహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఆటోలో డ్రైవర్ మరియు ఇద్దరు, ట్యాక్సీలో డ్రైవర్ తో పాటు ముగ్గురు మాత్రమే ప్రయాణం చేయాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చని... ఈ కామర్స్ కు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. 
 
పరిశ్రమలన్నింటికీ అనుమతులు ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. అన్ని రకాల ప్రార్థనా మందిరాలు బంద్ లో ఉంటాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కేసీఆర్ సడలింపులు అమలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో దుకాణాలు తెరవడానికి కేసీఆర్ అనుమతులు ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: