తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రైతులకు తగిన సలహాలు, సూచనలు చేశారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పచ్చి మోసం, బోగస్, గ్యాస్ అని అన్నారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరదని కేసీఆర్ అన్నారు. కేంద్రం ప్రకటించింది ప్యాకేజీనా... వాట్ ఈస్ దిస్ అంటూ విమర్శలు చేశారు. కేంద్రంపై మోదీ విమర్శలు చేయడంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 
 
సీఎం కేసీఆర్ చెప్పిన పంటలు వేస్తే మాత్రమే రైతు బంధు అమలు చేస్తామని అన్నారు. ఇష్టం వచ్చినట్టు పంటలు వేస్తే రైతు బంధు కట్ చేస్తామని అన్నారు. గతేడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండిందని ఈ సంవత్సరం 70 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేయాలని సూచించారు. రైతులకు ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతోనే పంటల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: