తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఏపీ తెలంగాణ మధ్య జరుగుతున్న జల వివాదం గురించి స్పందించారు. స్పందించటానికి ఇది సరైన సమయం కాదంటూనే కేసీవార్ వివాదం గురించి స్పష్టతనిచ్చారు. జగన్ కు, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని కేసీఆర్ అన్నారు. ప్రజలకు న్యాయం చేయాలనే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా భావిస్తోందని అన్నారు. అదే సమయంలో కేసీఆర్ కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై విమర్శలు చేశారు. 
 
రాష్ట్రాల విషయంలో కేంద్రం దారుణంగా వ్యవహరిస్తోందని అన్నారు. కేంద్రం ప్యాకేజీ పేరుతో అంకెల గారడీ చేస్తోందని విమర్శించారు. కేంద్ర వైఖరి రాష్ట్రాల విషయంలో నియంతృత్వంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నామని... రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో దుకాణాలను అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: