ప్రపంచానికి తామ దేశం ఎంతో సౌమ్యం అని.. మంచితనానికి మారు పేరు అని.. అందుకే భారత్ తో ఎప్పుడూ స్నేహ హస్తాన్ని అందిస్తున్నామని కల్లబొల్లి కబుర్లు చెబుతుంది దాయది దేశం పాకిస్తాన్.  కానీ తెర వెనుక మాత్రం ఉగ్రవాదులను ఉసిగొల్పి.. భారత సైనికులపై దొంగచాటు దెబ్బ తీస్తూనే ఉంది. అయితే మన భారత సైనికులు ఎప్పటికప్పుడు మెరుపుదాడులు చేస్తూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు బాగానే బుద్ది చెబుతున్నారు.  వారి ఆటలు ఎప్పటికప్పుడు కనిపెడుతూ తోక జాడించకుండా చూస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నతరుణంలో సైతం కశ్మీర్‌కు పాకిస్తాన్‌తో ఇబ్బంది తప్పడం లేదు. సరిహద్దుల్లో పాకిస్తాన్‌ వైపు నుంచి కాల్పుల మోత ఆగలేదు. ప్రస్తతం పాక్ కరోనా కష్టాలు పడుతున్నా...  తన వక్ర బుద్ధిని మాత్రం యధావిధిగా కొనసాగిస్తోంది.

 

తాజాగా పాకిస్థాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. మంగళవారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని సుందర్ బనీ సరిహద్దు వద్ద పాక్ సైనికులు మోర్టార్లతో కాల్పులకు తెగబడ్డారు. అలర్ట్ అయిన   భారత సైనికులు తిప్పికొట్టారు. పాక్ సైన్యంపై జరిపిన ఎదురుకాల్పులతో వారు తోకముడిచి పరుగులు పెట్టారు. అయితే పాకిస్తాన్‌తొ జరిగిన క్రాస్ ఫైరింగ్‌లో ఎవరూ గాయపడలేదు. కాగా,  ఈ కాల్పుల వెనుక ఓ కుట్ర కూడా ఉన్నట్లు ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. కాల్పులు జరుపుతూ.. మరో వైపు ఉగ్రవాదులను సరిహద్దులు దాటించే ప్రయత్నాలు జరుపుతున్నట్లుగా అనుమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: