కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా మానవుల జీవన విధానం మారుతోంది. దీంతో ఉద్యోగుల పని దినాల్లోను మార్పులు తీసుకురావాలని పలు దేశాలు భావిస్తున్నాయి. న్యూజిలాండ్ దేశంలోని ఉద్యోగులు నాలుగు రోజులే ప‌ని దినాలు ఉంటే బెట‌ర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉండగా ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ నాలుగు రోజులే పని దినాలు ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని కామెంట్ చేశారు. 
 
జెసిండా ఆర్డెర్న్ పరోక్షంగా కంపెనీలు నాలుగు రోజుల పనిదినాలను అమలు చేయాలని కంపెనీలకు సూచించారు. వారాంతపు సెలవులను పెంచాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ లైవ్ ఛాట్‌లో ఆమె కంపెనీలు, ఉద్యోగుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే నాలుగు రోజుల పనిదినాలు సాధ్యమే అని అన్నారు. ఈ ఐడియాపై దృష్టి పెట్టాల‌ని కంపెనీలకు సూచించారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: