సమ్మర్ రావడంతో థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడలేని ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ కుటుంబంతో కలిసి ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ తమకు నచ్చిన సినిమాను.. నచ్చిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే జానర్ తో సంబంధం లేకుండా థియేటర్లలో విడుదలైన ఎన్నో చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన గాయపడ్డ సింహం సినిమా కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ప్రముఖ డైరెక్టర్ కం హీరో తరుణ్ భాస్కర్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇది. జేడీ చక్రవర్తి  శ్రీ విష్ణు కీలక పాత్రలు పోషించారు.  భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.  ఇక ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చేసింది.  ఇకపోతే కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే.. మరొకవైపు థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని ఇటు అన్ కట్ వెర్షన్ తో నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ లలో స్ట్రీమింగ్ అవుతోంది ధురంధర్ .

అసలే థియేటర్లలో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి.. ఇటు ఓటీటీ లో మొదట విదేశాలలో అన్ కట్ వెర్షన్ గా 3:25 గంటల నిడివితో  నెట్ఫ్లిక్ లోకి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇండియాలో జియో హాట్ స్టార్ లో మాత్రం అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.  మొత్తానికైతే థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా కూడా తెలుగు తమిళ్ తో పాటు పలు పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది . మరి ఈ సినిమా దాటికి గాయపడ్డ సింహం సినిమా తట్టుకుంటుందా అనే కామెంట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. మరి ఏ సినిమాకి ఎలాంటి వ్యూస్ వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: