ఏపీ సీఎం జగన్ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ఈరోజు సంక్షేమంపై సదస్సు నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ పాదయాత్ర చేసే సమయంలో గ్రామాల్లో గ్రామాల్లో ఆరేడు బెల్టు షాపులు కనిపించాయని అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మద్యం షాపులు ఉంటే మద్యపాన నిషేధానికి న్యాయం జరగదని భావించానని చెప్పారు. అందుకే రాష్ట్రంలో బెల్టు షాపులను రద్దు చేశామని సీఎం తెలిపారు. 
 
రాష్ట్రంలో 33 శాతం మద్యం దుకాణాలను తగ్గించామని చెప్పారు. మద్యం ధరలు షాక్ కొట్టేలా చేయడంతో మద్యం తాగే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని అన్నారు. రేట్లు పెంచడం వల్లే రాష్ట్రంలో మద్యం కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గిందని అన్నారు. రాష్ట్రంలో వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 1,35,000 గ్రామ సచివాలయ ఉద్యోగాలు, 2,65,000 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: