ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రైతులకు అక్టోబర్ నెలలో 4,000 రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా ఖాతాలలో జమ చేస్తామని అన్నారు. ఖరీఫ్ రైతులకు లబ్ధి చేకూరేలా ఉచితంగా బోర్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మన ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే 10,290 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. మే నెలలో రైతులకు 7,500 రూపాయలు ఇచ్చామని తెలిపారు. 
 
అక్టోబర్ నెలలో 4,000 రూపాయలు, జనవరి నెలలో మరో 2,000 రూపాయలు జమ చేస్తామని తెలిపారు. ఈ ఏడాది నుంచి రైతులకు ఉచితంగా పంటల బీమా అందజేస్తామని సీఎం అన్నారు. ఈ నెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని... రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన మందులు, ఎరువులు అందేలా చేయడంతో పాటు ఈ కేంద్రాల ద్వారా రైతులకు వివిధ ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: