చైనాకు సమీపంలో ఉన్న చిన్న దేశం తైవాన్... 2003 సంవత్సరంలో సార్స్ తైవాన్ కు భారీ నష్టం కలిగించింది. దీంతో కరోనా విషయంలో మొదటి నుంచి తైవాన్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కరోనాను కట్టడి చేయడంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటివరకు ఇక్కడ 442 కరోనా కేసులు నమోదు కాగా 7 మంది మృతి చెందారు. తాజాగా తైవాన్ ప్రభుత్వం రెమ్ డెసివిర్ ను కరోనాకు మందుగా వాడాలని ఆదేశించింది. 
 
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ డీ ఏ గతంలో ఎమర్జెన్సీ మెడిసిన్ గా కరోనా పేషెంట్లకు రెమ్ డెసివిర్ ను ఇవ్వొచ్చని తెలిపింది. ఇప్పటివరకు క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన మొదటి మెడిసిన్ గా రెమ్ డెసివర్ గుర్తింపు తెచ్చుకుంది. ఆరోగ్య పరిస్థితి విషమించిన వారికి మాత్రమే ఈ మందు ఇవ్వాలని ఈ మందును తయారు చేసే గిలీడ్ సైన్సెస్ సంస్థ తేపింది. తాజాగా తైవాన్ ప్రభుత్వం కరోనా రోగులకు ఈ మందు వాడాలని సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: