దేశంలో ఫిబ్రవరి నెల నుంచి కరోనా కేసులు మొదలయ్యాయి. మొదట కేరళాలలో ఓ విదేశీయుడి నుంచి కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి.. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలకు ఈ మాయదారి కరోనా విస్తరించింది.  వీదేశీయుల నుంచి కొంత అయితే.. మర్కజ్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారితో మరికొంత కరోనా వైరస్ ప్రబలిపోయింది.  అయితే ఇప్పటి వరకు 4.0 లాక్ డౌన్ పాటిస్తూ వచ్చారు ప్రజలు.  అయితే కరోనా దేశంలో ఏమాత్రం తగ్గలేదు సరికదా  మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు లో బీభత్సం సృష్టింది. తాజాగా  ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో ఇవాళ కేంద్ర క్యాబినెట్ భేటీ అవుతున్న‌ది.  మ‌రికాసేప‌ట్లో ఈ స‌మావేశం ప్రారంభం కానున్న‌ది. 

 

బీజేపీ ప్ర‌భుత్వానికి ఏడాది పూర్తి అయిన సంద‌ర్భంగా మంత్రివ‌ర్గం స‌మావేశం జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది.  లాక్ డౌన్ 5.0 పై ఎలాంటి ముందుకు తీసుకు వెళ్లాలి.. లాక్ డౌన్ సడలింపు తర్వాత కేసులు పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవలి..  సెక్యూర్టీ, ఎక‌నామిక్ అఫైర్స్ అంశాల్లోనూ క్యాబినెట్ భేటీ జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. 

 

 మంత్రివ‌ర్గ స‌మావేశంలో చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అధికార వ‌ర్గాలు ద్వారా తెలుస్తున్న‌ది. చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు ప్ర‌తిష్టంభ‌న‌పై సెక్యూర్టీ ప్యానెల్ చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయి.  ఆర్థిక వ్య‌వ‌స్థ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ అంశంపై ఎక‌నామిక్ అఫైర్స్ క‌మిటీ చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: