ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. సీఎం జగన్ రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఈ పథకం ద్వారా బంపర్ ఆఫర్లు ఇచ్చారు సీఎం జగన్ రాష్ట్రంలో రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్ల ఖాతాలలో 10,000 రూపాయల చొప్పున నగదు జమ చేశారు. అర్హులై ఉండి నగదు జమ కాకపోతే గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. 
 
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని సీఎం అన్నారు. గ్రామ సచివాలయాల, గ్రామ వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని అన్నారు. ఎవరైన అర్హులై ఉండి నగదు జమ కాకపోతే దరఖాస్తును పరిశీలించి నగదు జమ చేస్తామని... కులాలు, మతాలు, పార్టీలు పట్టించుకోమని... కేవలం అర్హత ఉందా...? లేదా...? అని మాత్రమే చూస్తామని సీఎం చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: