పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో ఇద్దరు భారత అధికారుల అదృశ్యం కలకలం రేపుతోంది. ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ లో పని చేస్తున్న అధికారులు కనిపించడం లేదు. జాతీయ మీడియాలో ఈ మేరకు కథనం ప్రచురితమైంది. గడచిన రెండు గంటలుగా వీరు కనిపించడం లేదని తెలుస్తోంది. స్థానిక అధికారులు పాక్ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో పోలీస్ సిబ్బంది వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు ఇద్దరు దౌత్యవేత్తల మిస్సింగ్‌పై భారత ప్రభుత్వం ఆరా తీస్తోంది. అక్కడి అధికారులను సంప్రదించి వివరాలను పోలీస్ సిబ్బంది వివరాలను సేకరిస్తోంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారుల మిస్సింగ్ గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి