ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజా బడ్జెట్ లో గిరిజనులకు శుభవార్త చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా భారీ స్థాయిలో నిధులు కేటాయించారు. గిరిజనం బతుకుల్లో వెలుగులు నింపాలని గట్టి సంకల్పంతో.... ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా, వైద్యం, ఆరోగ్యంపై బడ్జెట్‌ లో వీరికి ప్రత్యేక కేటాయింపులు జరిపారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, మౌలిక సదుపాయాలను మెరుగు పరచడం కొరకు ప్రభుత్వం విశాఖ జిల్లా పాడేరుకు వైఎస్సార్‌ వైద్య కళాశాలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కేఆర్‌పురం, శ్రీశైలంలో అదనంగా ఆరు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను కూడా నిర్మించాలని గతంలో నిర్ణయం తీసుకున్న జగన్ బడ్జెట్ లో వీటి కోసం నిధులు కేటాయించారు. విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం ద్వారా ప్రభుత్వం భావించి బడ్జెట్ లో నిధులు కేటాయించినట్లు బుగ్గన తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: