ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల కరోనా కేసులు నమోదు కాగా 4,79,000 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. మృతుల సంఖ్య 5,00,000కు చేరువలో ఉండటం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా మరణాల శాతం 5.5గా ఉంది. కరోనాకు మందులు, ఇంజెక్షన్ లు అందుబాటులోకి వస్తూ ఉండటంతో అతి త్వరలో వైరస్ ను నియంత్రించవచ్చని వైద్యులు భావిస్తున్నారు. 
 
మరోవైపు దేశంలో వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో 15,000కు పైగా కేసులు నమోదవుతూ ఉండగా తెలంగాణలో 730 కేసులు నమోదు కావడంతో మరికొన్ని రోజుల్లో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: