తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోరిక మేరకు యాడ్ ఫ్రీ ఛానల్‌గా ఎస్వీబీసీ ఛానల్ రానుందని అధికారులు కీలక ప్రకటన చేశారు. భక్తుల మనోభావాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. భక్తులు యాడ్ ఫ్రీ ఛానల్ నిర్వహణ కోసం విరాళాలు అందిస్తే స్వీకరిస్తామని ప్రకటన చేశారు. 
 
భవిష్యత్తులో కూడా ఎస్వీబీసీ ఛానల్ ద్వారా మంచి కార్యక్రమాలను భక్తులకు అందించడానికి తాము ప్రయత్నం చేస్తామని... లాభాపేక్ష లేకుండా పని చేస్తామని తెలిపారు. భక్తులు 25 లక్షల రూపాయలను ఛానల్ కు విరాళంగా ఇచ్చారని సమాచారం. కేంద్రం లాక్ డౌన్ సడలింపులు అమలు చేయడంతో జూన్ 11 నుంచి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాలు మొదలయ్యాయి. టీటీడీ భక్తుల కోసం 13,000 టికెట్లను అందుబాటులో ఉంచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: