హైదరాబాద్: *‘ధరణి ఐ లవ్ యు’* మూవీ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత, *కల్ట్ ప్రొడ్యూసర్ SKN* ఘనంగా ఆవిష్కరించారు. చిత్ర బృందం సమక్షంలో జరిగిన ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమం సందడిగా జరిగింది.
ఈ సందర్భంగా SKN మాట్లాడుతూ.. *‘ధరణి ఐ లవ్ యు’* సినిమా పోస్టర్ ఆసక్తికరంగా ఉందని, టైటిల్‌తోనే సినిమాపై క్యూరియాసిటీ కలుగుతోందని అన్నారు. ధరణి i love you డైరెక్టర్ సాయికృష్ణ కె.వి కి ఇది సెకండ్ మూవీ.. తను రాజమౌళి గారి దగ్గర మగధీర మూవీకి అసోసియేట్ గా వర్క్ చేసారు.. నిర్మాత రాజశేఖర్ గారికి,చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
డైరెక్టర్ సాయికృష్ణ కె.వి మాట్లాడుతూ 'కల్ట్ ప్రొడ్యూసర్ SKN గారి చేతులు మీద మా ధరణి i love you ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది.. ఆయన ఇండస్ట్రీ లో టైమింగ్ ఉన్న ప్రొడ్యూసర్.. బేబీ, చెన్నై లవ్ స్టోరీ.. ఇలా వరుస విజయలతో బిజీ ఉండి ధరణి i love you పోస్టర్ లాంచ్ చేసినందుకు చాలా థాంక్స్.. ఆయన స్టేజ్ మీద ఒక రైమింగ్ తో టైమింగ్ లో ఇచ్చే స్పీచ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.. అందులో నేను ఒకడిని అన్నారు..
నిర్మాత, హీరో, హీరోయిన్స్ చిత్ర బృందం మాట్లాడుతూ.. తమ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను SKN చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందిస్తున్నామని, త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాయికృష్ణ కె.వి, నిర్మాత రాజశేఖర్ మద్దికుంట, హీరో వంశీ, హీరోయిన్ మహిత, రైటర్ బాలసూర్య చిత్ర యూనిట్ సభ్యులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
సమర్పణ - శ్రీమతిబాలామణి
మాటలు- కామన వి.సాయి, బాలసూర్య
పాటలు - ఉమా వంగూరి, చాందిని,విశ్వనాధ్ కారసాల
మ్యూజిక్- పద్మనాబ్ భరద్వాజ్
ఎడిటింగ్- నందమూరి హరి,ఎన్.టి.ఆర్, సినిమాటోగ్రఫీ- చిన్నయోగి అన్నెం
ఆర్ట్-జగన్.బి
ఫైట్స్ - దేవరాజ్,నందు, జీవన్
కొరియోగ్రఫీ- చంద్రకిరణ్, కాస్ట్యూమ్స్-లోకేష్
మేకప్- రాఘవ
స్టిల్స్- కృష్ణ, శ్రీను
డైరెక్షన్ డిపార్ట్మెంట్ - బ్రహ్మజీ, వెంకటేష్, శ్రీను, మహిపాల్,
పబ్లిసిటీ- నవీన్ నంద్యాల
పి.ఆర్.ఓ- కడలి రాంబాబు
నిర్మాత- రాజశేఖర్ మద్దికుంట,
కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం - సాయికృష్ణ.కె.వి
....
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి