తెలంగాణ సర్కార్ కొన్ని రోజుల క్రితం లబ్ధిదారులకు రైతుబంధు నగదు జమ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం రాష్ట్రంలో రూ.6,888.43 కోట్లు జమ చేసింది. రాష్ట్రంలోని 54.22 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమైంది. సీఎం ఆదేశాల మేరకు 3 రోజుల్లోనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రైతుల ఖాతాలలో అధికారులు నగదు జమ చేశారు. అయితే కొందరు రైతుల ఖాతాలలో అర్హులైనా నగదు జమ కాలేదు. 
 
తాజాగా తెలంగాణ సర్కార్ వీరి గురించి స్పందించింది. రాష్ట్రంలోని 5 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో రైతుబంధు సొమ్ము జమ చేయడం కుదరదని వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. గడిచిన ఆరు నెలలుగా బ్యాంకు లావాదేవీలు జరపని ఖాతాలలో కూడా నగదు జమ చేయలేదని ప్రకటన వెలువడింది. లావాదేవీలు జరపని ఖాతాలు మూతపడినట్లు కంప్యూటర్లలో చూపుతోందని.... అలాంటి వారికి నగదు జమ చేయలేదని ప్రభుత్వం చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: