రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా రైతుల ఖాతాలో నుంచి డబ్బులు స్వాహా చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది, 

 

 గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడు లో ఎయిర్టెల్ మినీ పేమెంట్ బ్యాంక్ ముసుగులో సైబర్ నేరగాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎయిర్టెల్ కేవైసీ ముసుగులో రైతుల నుంచి వేలిముద్రలు తీసుకుని 150 మంది రైతులు ఖాతాల్లో  సుమారు 15 లక్షల రూపాయల నగదును స్వాహా చేశారు, దీనిపై ఎయిర్టెల్ కార్యాలయాన్ని ఆశ్రయించిన సిబ్బంది స్పందించలేదు దీంతో పోలీసులను ఆశ్రయించారు రైతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: