ఏపీ రైతులకు సీఎం జగన్ రైతు దినోత్సవం సందర్భంగా శుభవార్తలు చెప్పారు. రైతులకు 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి, 2,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేశామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు వైయస్సార్ బీమా ద్వారా 7 లక్షల రూపాయలు ఇస్తున్నామని అన్నారు. అక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. ఏపీలో నాలుగు హార్బర్ల కోసం నాబార్డుతో ఒప్పందం చేస్తున్నామని అన్నారు. 
 
కరోనా సమయంలో రైతులకు సాధ్యమైనంత మేర మంచి చేయాలనే తాపత్రయంతో 8.25 లక్షల మెట్రిక్ టన్నుల 2,753 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం కొనుగోలు చేసిందని అన్నారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేశామని తెలిపారు. రైతుల కోసం నాన్నగారు ఎంతో చేశారని సీఎం జగన్ అన్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: