ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ పేషెంట్ విషయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఒక్కొక్కటిగా బయటపడుతున్న విషయం తెలిసిందే.తాజాగా సిద్దిపేట కోవిడ్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కరోనా బారినపడి మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని తరలించకుండా అలాగే వదిలేశారు సిబ్బంది.
మిగతా పేషెంట్లు దీనికోసం పదే పదే సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ మృతదేహాన్ని మాత్రం పట్టించుకోలేదు. దీంతో గంటలపాటు మృతదేహం అలాగే బెడ్ పైన పడివుంది . ఇక దుర్వాసన రావడంతో మిగతా పేషెంట్స్ ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా సిబ్బంది నిర్లక్ష్యపు ఘటనలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులంటేనే జంకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి