కరోనా వ్యాప్తి  నేపథ్యంలో రాష్ట్రంలో  నెలకొన్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రభుత్వం  ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుందని..  ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తుందని తెలిపారు. కరోనా  రోగుల భయపడాల్సిన పని లేదని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులకు వరాల జల్లు కురిపించారు  ముఖ్యమంత్రి కేసీఆర్.



ఆయుష్ అధ్యాపకులకు పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం పీజీ పూర్తి చేసిన 1200 మంది వైద్య విద్యార్థులకు ప్రభుత్వ సర్వీసుల్లో కి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసారు. అంతేకాకుండా ఖాళీగా ఉన్న 200 డాక్టర్ల పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు.  పారిశుధ్య కార్మికులకు ఇన్సెంటివ్ ఉంటుందని... ప్రభుత్వ డాక్టర్లతో పాటు అవుట్సోర్సింగ్ డాక్టర్లకు కూడా 10 శాతం అదనపు వేతనం చెల్లిస్తామని స్పష్టం చేశారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: