భారతదేశ సరిహద్దులో దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరమరణం పొందిన సైనికులను 74వ స్వాతంత్ర దినోత్సవం సంధర్భంగా త్రివిధ దళాధిపతి, రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దనున్న నేషనల్ వార్ మెమోరియల్ లో వారికి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఆయనకు త్రివిధదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, భారత వైమానిక దళం చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ భదౌరియా స్వాగతం పలికారు.

అంతకుముందు, ప్రధానమంత్రి మోడీ జాతీయ ఎర్ర కోట మీద జెండాను ఎగురవేశారు. అక్కడి నుండే జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్రానంతరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ ని గత ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: