దేశవ్యాప్తంగా నేటి నుంచి అన్ లాక్ 4 మొదలైంది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో బార్లు రెస్టారెంట్లు ఓపెన్ చేశారు. కర్ణాటకలో నేటి నుంచి బార్లు ఓపెన్ చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే.అయితే స్కూల్స్ తో పాటుగా కొన్ని మత సంబంధమైన సమావేశాలకు ఈనెల 30 వరకు అనుమతి లేదని స్పష్టం చేసింది కేంద్రం.


 స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ రాజకీయ కల్చరల్ సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే నేటి నుంచి అంతర్ రాష్ట్ర రవాణా పై పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టం చేసింది అయితే రాజకీయ మతపరమైన సమావేశాలకు కేవలం వంద మంది మాత్రమే ఉండే విధంగా అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్ 7 నుంచి దేశవ్యాప్తంగా గ్రేడెడ్ పద్ధతిలో మెట్రో రైళ్లను ఓపెన్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది

మరింత సమాచారం తెలుసుకోండి: