త్రిపుర ముఖ్యమంత్రి బిప్లాబ్ దేబ్... రాష్ట్ర మీడియాపై "క్షమించరు" అనే వ్యాఖ్య చేసిన తర్వాత... ఆయనను విమర్శించిన ఒక జర్నలిస్ట్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టారు. కరోనా వైరస్ సంక్షోభం సమయంలో బిజెపి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనే ఆరోపణలు సిఎం చేసారు. దీనిపై త్రిపురలో బెంగాలీ దినపత్రికతో పని చేసే పరాశర్ బిస్వాస్ అనే జర్నలిస్ట్ మండిపడ్డాడు.

కరోనా సమయంలో విధుల్లో ఉండగా అతనికి కరోన సోకింది. కరోనా కేర్ యూనిట్ నుండి డిశ్చార్జ్ అయిన తరువాత, జర్నలిస్టులను బెదిరించారు అనే ఆరోపణలతో ముఖ్యమంత్రిని విమర్శిస్తూ ఒక వీడియో చేశాడు.  శుక్రవారం అతను ఈ వీడియో రికార్డ్ చేసాడు. కాస్త దూకుడుగా విమర్శలు చేయడంతో... జర్నలిస్ట్ ని శనివారం రాత్రి ధలై జిల్లా ప్రధాన కార్యాలయం అంబస్సాలోని తన ఇంటి వద్ద కొట్టారు.   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: