ఒక పక్క విమర్శలు, అరెస్ట్ లు, రాష్ట్ర వ్యాప్త నిరసనలు, తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం, రాజీనామాలు చేయాలని డిమాండ్ లు... అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దేవాలయలపై దాడులు మాత్రం అసలు ఆగడం లేదు. రోజు రోజుకి తీవ్రంగా జరుగుతూనే ఉన్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితం అయిన దాడులు ఇప్పుడు రాయలసీమకు కూడా పాకాయి.

చిత్తూరు జిల్లాలోని గంగాధర్ నెల్లూరు మండలం అగరమంగలం లోని ఈశ్వర ఆలయంలో  ధ్వంసమైంది నంది విగ్రహం. రాత్రి  గుర్తుతెలియని దుండగులు  విగ్రహాన్ని  రెండుగా ధ్వంసం చేశారని అధికారులు పేర్కొన్నారు. దీనిపై పోలీసులు  ఆరా తీస్తున్నారు. ఇటీవల కాలంలో హిందూ ఆలయాలల్లో అనేక అపచార కార్యక్రమాలు  పెరుగుతున్నాయి. దీనితో హిందు వాదుల్లో క్రమంగా ఆందోళన పెరుగుతుంది.  ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: