ఆంధ్రప్రదేశ్ లో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఏపీ సిఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుకి మాత్రమే ఉందని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.  పేద విద్యార్ధులు అందరూ కూడా చదువుకోవాలని ఆయన అన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్య అనేది ఖరీదు అయిపోయింది అన్నారు.

అది మార్చాలి అంటే కచ్చితంగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నానీ, పేర్ని నానీ, మహిళా కమీషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. స్కూల్ లో డ్రాప్ అవుట్స్ గురించి ప్రభుత్వం ఆలోచించలేదు అని చెప్పారు. పేదలకు మంచి విద్యా ప్రమాణాలు అందించాలి అనే అంగన్ వాడీ నుంచి కూడా సమూల మార్పులు తెచ్చామని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: