వరదలతో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టంపై అధికారులు
ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మరణించినట్టు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 11 మంది మృతి చెందినట్లు తెలిపారు.రాష్ట్రంలో 7.35 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. దెబ్బతిన్న పంటల్లో కనీసం సగం పంటలకు లెక్కించినా... రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు.
ఈ యాసంగి సీజన్‌లో యాభై లక్షల ఎకరాల్లో వరిపంటను సాగు చేయాలని, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని నిర్ణయించారు. శనగపంటను నాలుగున్నర లక్షల ఎకరాల్లో, వేరు శనగను నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేయాలని.. మిరపతో పాటు ఇతర కూరగాయలను లక్షన్నర నుంచి రెండు లక్షల ఎకరాల్లో సాగు చేయాలని తెలిపారు.